భారత జట్టుకు బీసీసీఐ నజరానా…

214
- Advertisement -

ఇవాళ(3-2-18 శనివారం) ఆస్ట్రేలియాతో జరిగిన అండర్ -19 ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత జట్టు గెలిచిన అనంతరం.. భారత జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. విజేత జట్టు సభ్యులకు రూ. 30 లక్షల చొప్పున నజరానా ప్రకటించిన బీసీసీఐ.. కోచ్ ద్రావిడ్‌కు రూ. 50 లక్షలు, సహాయ బృందానికి రూ. 20 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది.

 under 19 world cup 2018: BCCI announces huge cash reward for ...

ఆసీస్ విధించిన 217 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేవ‌లం 38.5 ఓవ‌ర్ల‌లోనే చేజ్ చేసింది. టోర్నీ మొత్తం అజేయంగా నిలిచిన పృథ్వి షా సేన‌.. ఫైన‌ల్లోనే అదే జోరు కొన‌సాగించింది. తిరుగులేని ఆధిప‌త్యం చెలాయించింది. బౌలింగ్‌, ఫీల్డింగ్‌, బ్యాటింగ్.. ఇలా అన్ని రంగాల్లో రాణించి మూడుసార్లు విశ్వ విజేత అయిన ఆస్ట్రేలియాను ఓ ప‌సికూనగా మార్చేసింది. ఓపెన‌ర్ మ‌న్‌జోత్ క‌ల్రా (101 నాటౌట్‌) సెంచ‌రీతో చెల‌రేగాడు.

టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఇదే ఆస్ట్రేలియాపై వంద ప‌రుగుల‌తో గెలిచిన టీమిండియా.. ఫైన‌ల్లోనూ ఆసీస్‌ను మ‌ట్టి క‌రిపించింది. టోర్నీలో ఆసీస్‌తో మొద‌లుపెట్టి ప‌పువా న్యూ గినియా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌.. మ‌ళ్లీ ఆస్ట్రేలియాపై గెలిచి నాలుగోసారి వ‌ర‌ల్డ్‌క‌ప్ ఎగ‌రేసుకుపోయింది. రాహుల్ ద్ర‌విడ్ కోచింగ్‌లో రాటుదేలిన పృథ్వి షా సేన‌.. నిజ‌మైన చాంపియ‌న్ టీమ్‌లాగే ఆడి విజ‌యం సాధించింది.

under 19 world cup 2018: BCCI announces huge cash reward for ...

కాగా.. ఈ సందర్భంగా భారత యువ జట్టు గెలవడంపై ఆ జట్టు హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఆనంద వ్యక్తం చేశారు. కుర్రాళ్ల ఆట పట్ల గర్వంగా ఫీలవుతున్నాను అని తెలిపిన ఆయన.. ఈ విజయంలో సహాయక సిబ్బంది పాత్ర మరవలేనిదన్నారు.

గత 14 నెలలుగా తమ టీమం కష్టపడిందని.. ఈ విజయం ప్లేయర్లకు చిరకాలం గుర్తుండిపోతుందన్నారు. ఇక కుర్రాళ్లుకు ఈ విజయం ఓ తీపి గుర్తే కాకుండా వారి భవిష్యత్తును నిర్ధేశిస్తుందని ద్రవిడ్ తెలిపారు .

- Advertisement -