ఇరాన్ లో కుప్పకూలిన విమానం..180మంది దుర్మరణం

416
Boeing 737 crashes in Iran
- Advertisement -

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో బుధవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఉక్రెయిన్ నుంచి 180 మంది ప్రయాణికులతో ఇరాన్‌కు వస్తున్న బోయింగ్ 737 విమానం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖయోమీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. టెహ్రాన్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుండగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 180ప్రయాణికులు, సిబ్బంది దుర్మరణం చెందారు. విమానం సుమారు గంట ఆలస్యంగా గమ్యస్థానానికి బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాలతో విమానం కూలినట్లు అధికారులు వెల్లడించారు.

విమానం కూలిపోతుండగా తీసిన వీడియోను స్థానిక మీడియా సంస్థ విడుదల చేసింది. అమెరికా ఈ విమానాన్ని కూల్చివేసిందని ఇరాన్ ఆరోపణలు చేస్తుంది. మరోవైపు విమానం కూలడంపై తమకు ఎలాంటి సంబందం లేదని తేల్చి చెప్పారు అమెరికా అధికారులు. గల్ఫ్‌ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత విమానయాన శాఖ అప్రమత్తమైంది. ఇరాక్‌, ఇరాన్‌తో గల్ఫ్‌ పరిధిలోని గగనతలంలోకి వెళ్లొద్దని భారత విమానయాన సంస్థలకు కేంద్ర హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisement -