భారత్‌కు క్షమాపణలు చెప్పిన ఉక్రెయిన్

45
- Advertisement -

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉక్రెయిన్ చేసిన ఓ ఫోటోపై భారత్‌కు క్షమాపణలు తెలిపారు. దీనిపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ఉక్రెయిన్ తీరుపై మండిపడ్డారు. ఈ చిత్రం హిందువుల మనోభావాలపై దాడిగా అభివర్ణించారు. ఈ ఫోటోపై ఉక్రెయిన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: Tuna Fish:ఆరోగ్య ప్రయోజనాలు

కాళీమాత ఫోటోతో అభ్యంతరకర ట్వీట్ చేసినందుకుగానూ ఆదేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమిన్ ఝఫరవో విచారం వ్యక్తం చేశారు. అంతకుముందు భారతీయులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. కాళీ దేవతను వక్రీకరిస్తూ చిత్రీకరించినందుకు ఉక్రెయిన్ పశ్చాత్తాపడుతోందని ఉక్రెయిన్ భారతీయ సంస్కృతిని గౌరవిస్తుంది. భారత్ సహాయాన్ని మేము అభినందిస్తున్నాము అని ఎమిన్ తెలిపారు. రష్యాలో చమురు డిపోపై దాడి చేసిన తర్వాత వెలువడిన పొగపై కాళీమాతను తలిపించేలా హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో గుర్తుతెచ్చేలా ఓ ఫోటోను ట్వీట్ చేసింది. దీనికి వర్క్ ఆఫ్ ఆర్ట్ అనే క్యాప్షన్ కూడా జత చేసింది.

Also Read: NCP:శరద్ పవార్ రాజీనామా…!

- Advertisement -