Tuna Fish:ఆరోగ్య ప్రయోజనాలు

34
- Advertisement -

సీఫుడ్స్ లో ట్యూనా ఫిష్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల సముద్రంలో ఉంటుంది. సముద్రంలో లభించడంతో దీన్ని ఉప్పు చేప అని కూడా అంటారు. ట్యూనా చేప వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగాల నుంచి చేప‌లు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయి. అయితే కొన్ని చేప‌లు రుచితో పాటుగా ఖ‌రీదు కూడా ఎక్కువే.. అలాంటి వాటిల్లో ఇది కూడా ఓకటి.

అందుకే ప్రపంచ ట్యూనా దినోత్సవం ప్రతి సంవత్సరం మే 2 న జరుపుకుంటారు. మొదటిసారిగా 2017లో ట్యూనా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ట్యూనా చేపల జాతి అంతరించిపోకుండా చేయడమే ఈ రోజు ఉద్దేశం. ట్యూనా చేపలో ఒమేగా 3, విటమిన్ బి12, ప్రోటీన్లు మరియు ఇతర ఖనిజాలు వంటి అనేక గొప్ప లక్షణాలు ఉన్నాయి. అదే విధంగా తక్కువ కొవ్వు, ప్రోటీన్స్ ఉంటాయి. పిల్లలు, గర్భిణీలు తరచుగా వీటిని తినడం మంచిదని చెబుతారు నిపుణులు. ప్రపంచంలోనే అతిపెద్ద ట్యూనా ఉత్పత్తి చేసే దేశాలలో థాయిలాండ్ ఒకటి.

Also Read:IPL 2023:కోహ్లీ గంభీర్ మద్య గొడవ.. ఇప్పట్లో తగ్గదా?

ట్యూనాలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్స్రర్ కణాలతో పోరాడతాయి. రొమ్ము క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, పేగు క్యాన్సర్, వంటి వాటిని ట్యూనా చేపను తినడం ద్వారా గణనీయంగా తగ్గించవచ్చు. అయితే ఈ చేపలు ఎక్కువగా తింటే కొన్ని దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మెర్క్యూరీని థర్మామీటర్లలో, విద్యుత్ ప్లాంట్లలో, సిమెంట్ ప్లాంట్లలో రా మెటిరియల్ గా ఉపయోగిస్తారు. ఈ మెర్క్యురీకి సంబంధించిన వేస్టును ఆయా పరిశ్రమకు సంబంధించిన వారు సముద్రంలో కలుపుతారు. ఈ వేస్ట్ మెర్కయురీని తింటే భవిష్యత్తులో వాటిని పట్టి తిన్న మనుషులపై అనేక దుష్ప్బ్రవాలు ఉంటాయి.మెర్క్యురీ తిన్న చేపలను తింటే అది బాడీలో న్యూరోటాక్సిన్స్ గా మారి మెదడు పై ప్రభావం చూపుతుంది. మెర్క్యూరీ తిన్న ట్యూనా చేపలను పిల్లలు తింటే, పిల్లల్లో బుద్ధిమాంద్యం పెరిగే అవకాశం ఉంది. సెరిబ్రల్ పాల్సీ, చెవిటితనం, అంధత్వానికి కూడా దారితీస్తుంది.బాడీలో అధిక తిమ్మిర్లకు కూడా కారణం కావచ్చు.

Also Read:కూల్ వాటర్ తాగితే.. మగవారికి ప్రమాదమా?

- Advertisement -