కరోనా మరణాలపై డ్యబ్లూహెచ్‌వో కీలక వార్నింగ్…

212
michel ryan
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు,మరణాలు రోజురోజుకి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డ్యబ్లూహెచ్‌వో కీలక వార్నింగ్ ఇచ్చింది. కరోనా మరణాలు 20 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని ఆసంస్ధ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ తెలిపారు. ప‌ది ల‌క్ష‌ల మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం పెద్ద సంఖ్యే అని, అయితే ఆ మ‌ర‌ణాల సంఖ్య పెర‌గ‌కుండా ఉండేందుకు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మైఖేల్ ర్యాన్ తెలిపారు.

యూరోప్‌లోని స్పెయిన్‌, పోల్యాండ్‌, ఫ్రాన్స్ దేశాల్లో కొత్త కేసులు న‌మోదు కావ‌డంతో అక్క‌డ మ‌ళ్లీ లాక్‌డౌన్ విధించారు. బ్రిట‌న్‌లో కూడా అనేక ప్రాంతాల్లో ఆంక్ష‌ల‌ను కొన‌సాగిస్తున్నారు. అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప బ‌య‌ట‌కు రావ‌ద్దు అంటూ ర‌ష్యా ప్ర‌జ‌ల‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 9,85,707 మంది కరోనాతో మృతిచెందగా 32.3 మిలియ‌న్ల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయని ఆయన వెల్లడించారు. అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికాలో 70 ల‌క్ష‌ల‌కు పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయన్నారు.

- Advertisement -