బాలుకి భారతరత్న ఇవ్వాలి: హీరో అర్జున్

143
sp balu

గానగంధర్వుడు బాలసుబ్రమణ్యంకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు హీరో అర్జున్‌. తిరువళ్ళూరులోని తామరైపాక్కం ఫాంహౌజ్‌కు వచ్చిన అర్జున్ ఎస్పీబీకి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఎస్పీబీకి భారత రత్న ఇవ్వాలన్నారు. ఇందుకోసం తెలుగు, మ‌ల‌యాళ‌, త‌మిళం ఇండ‌స్ట్రీలు అన్ని క‌లసి రావాలన్నారు. 45 వేల పాట‌లు రెండు జ‌న్మ‌లు ఎత్తిన ఇంకెవరు పాడలేరని పేర్కొన్నారు అర్జున్.

ఆగస్టు 5న కరోనాతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన బాలు నిన్న సెప్టెంబర్ 25న మధ్యా హ్నం 1:04 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఎస్పీ బాలు మృతితో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతిలో మునిగిపోయింది.