ట్విట్టర్ బ్లూ టిక్ కు డబ్బులు చెల్లించాలా ?

188
- Advertisement -

ట్విట్టర్ యూజర్లకు భారీ షాక్ తగలనుంది. టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ కొనుగోలు తరువాత సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. సరికొత్తగా బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు అంతర్గత పత్రాలను ఉటంకిస్తూ వెర్జ్ రిపోర్ట్‌ చేసింది. .నవంబర్ 7లోగా ఈ కొత్త వెరిఫికేషన్ రీవాంప్‌ను రూపొందించాలని, లేదంటే వేటు తప్పదని మస్క్ తన ఉద్యోగులను కోరినట్లు సమాచారం. ట్విటర్ అకౌంట్ వెరిఫికేషన్ చేసి బ్లూ టిక్ ఇవ్వడానికి ట్విటర్ ఇక నుంచి డబ్బులు వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది.

వెరిఫైడ్ యూజర్స్ నెలకు 4.99 డాలర్లు ట్విటర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.415. వెరిఫైడ్ అకౌంట్‌లలో బ్లూ టిక్‌ను అలాగే మెయింటేన్ చేసేందుకు ఇలా ఛార్జ్ చేయనున్నట్టు సమాచారం. అయితే దీనిపై ఎలన్ మస్క్ ఇంకా పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోలేదు.

బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ ఫీజుపై నెటిజన్లు మండి పడుతున్నారు. పలు మీమ్స్‌, సెటైర్లతో మస్క్‌పై మండిపడుతున్నారు. నెలకు అన్ని డబ్బులు చెల్లించడం అవసరమా? అని విమర్శిస్తున్నారు. బ్లూ టిక్కా? అసవసరమే లేదు. అదేమీ సర్టిఫికేట్‌ కాదుగా..అసలు నేను ఎపుడూ అడగలేదు నెటిజన్లు మండిపడుతున్నారు.

 

ఇవి కూడా చదవండి

యూత్‌కే స్ట్రోక్‌ ముప్పు..

సునామీ భయంతో 80 మంది సజీవ సమాధి

కాంతార ఓటీటీ షాక్‌!

 

- Advertisement -