కట్టప్ప పేరును పలక్కుండా ఉండలేకపోతున్న..!

169
Twinkle Khanna can’t stop gushing over Kattappa
Twinkle Khanna can’t stop gushing over Kattappa
- Advertisement -

బాహుబలి:ది కన్‌క్లూజన్‌ సినిమా టాలీవుడ్‌, బాలీవుడ్‌ రికార్డులు కొల్లగొట్టింది. బాహుబలి మొదటి పార్టు చూసినవారు.. బాహుబలి2 సినిమాని ఇప్పటికే కనీసం రెండు సార్లైనా చూసి ఉంటారు.. ఇక సెలబ్రిటీలు కూడా బాహుబలి సినిమాని చూస్తూ తమ ఫీలింగ్స్‌ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా… కట్టప్ప పాత్రకు ఫిదా అయిపోయిందట. ఇటీవల ‘బాహుబలి-2’ చూసిన ట్వింకిల్.. తన కూతురిని కట్టప్ప అనే పిలుస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.

tw

‘‘బాహుబలి సినిమా చూశాను. అప్పట్నుంచి నా కూతుర్ని కట్టప్ప అనే పిలుచుకుంటున్నా. ఇది ఆమె తండ్రి (అక్షయ్)ని కొంచెం బాధపెడుతుందేమో.. ఎందుకంటే ఆయన తన కూతుర్ని ‘రౌడీ’ అని పిలిచేందుకే ఇష్టపడతారనుకుంటా..!’’ అని ట్వీట్ చేసింది. కట్టప్ప అని మూడు సార్లు పలికితే.. ఇక ఆ పేరును పలక్కుండా ఉండడం సాధ్యం కాదని, వేఫర్లు తింటే ఎలా ఎడిక్ట్‌ అవుతామో కట్టప్పకు కూడా అంతే ఎడిక్ట్‌ అవుతాం ట్వీటు చేసింది.

- Advertisement -