“ప్రతిరోజూ పండగే” మోషన్ పోస్టర్(వీడియో)

510
PrathiRoju Pandage

వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి మూవీతోతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు. తేజ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రతిరోజూ పండుగే అనే సినిమాలో నటిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. బంధాలు .. అనుబంధాల కుటుంబం అనే కాన్సెప్ట్ ఈమూవీని తెరకెక్కిస్తున్నారు.

సాయి ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈమూవీని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ సెంటిమెంట్ గా ఈసినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. తాజాగా ఈసినిమాకు సంబంధించి టైటిల్ మోషన్ టీజర్ ను విడుదల చేశారు. తేజుకి తాతయ్య పాత్రలో సత్యరాజ్ కనిపించనున్నారు.

ఈ సినిమాకి ఆయన పాత్ర కీలకం కానుంది. తాత మనవళ్లకి సంబంధించిన టీజర్ ను ఈచిత్ర బృందం విడుదల చేసింది. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచానాలు పెంచేశారు దర్శకుడు మారుతి. డిసెంబర్ చివర్లో ఈమూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.