షెడ్యూల్‌ ప్రకారమే టీఆర్టీ:ఘంటా

237
TSPSC Chairman Ghanta Chakrapani on TRT Exam
- Advertisement -

షెడ్యూల్ ప్రకారమే టీఆర్ఎస్ పరీక్ష జరిగి తీరుతుందన్నారు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి. సోషల్ మీడియాలో పరీక్ష నిర్వహణపై వస్తున్న పుకార్లను నమ్మోద్దని సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఘంటా.. అభ్యర్థుల రిక్వెస్ట్ మేరకు దగ్గరలోని హెచ్‌ఎండీఏ పరిధిలో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.

ఇప్పటివరకు లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులు 9 వేల మంది హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. టెక్నికల్ సమస్యతో మొదట్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇప్పుడు అలాంటి సమస్యలు లేవన్నారు. సీజీజీ సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు.

TSPSC Chairman Ghanta Chakrapani on TRT Exam

ఏ జిల్లా వారికి ఆ జిల్లాలోనే పరీక్షా సెంటర్లు ఉంటాయన్నారు. ఫిబ్రవరి- 23 పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు డౌన్ లోడు అవుతున్నాయని, ఫిబ్రవరి- 24వ తేదీకి సంబంధించిన హాల్ టికెట్లు గురువారం (ఫిబ్రవరి-22) నుంచి తీసుకోచ్చన్నారు. ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బందిలేదని, అభ్యర్థులు అనుకున్న సమయానికే పరీక్ష ఉంటుందన్నారు. అప్లికేషన్ ప్రజెంటేషన్ ప్రకారమే హాల్ టికెట్లు పంపిణీ చేశామన్నారు. 15 ఫిబ్రవరిన హాల్ టికెట్స్ ఏడు రకాలుగా జారీ చేశామన్నారు.

అయితే సెంటర్లు దూరంగా ఉన్నాయని అభ్యర్థుల నుంచి రిక్వెస్టులు వచ్చాయని, డేటా చూసి కొత్త సెంటర్లను అప్డేడ్ చేశామన్నారు. అభ్యర్థులు గందరగోళంలో ఉన్న క్రమంలో హెల్ఫ్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

- Advertisement -