తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు..

71
- Advertisement -

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష‌ను ఏప్రిల్ 21న నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా కేంద్రం ప్ర‌క‌టించడంతో ఈ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు వచ్చాయి… ఈనేపథ్యంలో జేఈఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రయ్యే విద్యార్థుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఉండేలా ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను రెండు రోజులు ఆల‌స్యంగా మొద‌లుపెట్టేలా ఇంట‌ర్ బోర్డు రీషెడ్యూల్‌ చేసింది.

ఈ మేర‌కు తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం సాయంత్రం ఓ ప్ర‌క‌ట‌న చేసింది. రిషెడ్యూల్‌ చేసిన తేదీల ప్రకారం.. ఏప్రిల్ 22 నుంచి మే 6 వరకు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు.. ఏప్రిల్ 23 నుంచి మే 7 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11,12 న ఎన్విరాన్‌మెంటల్‌ పరీక్ష ఉండనుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్ష తేదీలను ఖరారు చేసింది.

ఫస్ట్ ఇయర్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌..

-ఏప్రిల్ 22 న పేపర్ 1 తెలుగు/ సంస్కృతి
-ఏప్రిల్ 25 న ఇంగ్లీష్ పేపర్ 1
-ఏప్రిల్ 27న మాథ్స్ పేపర్1A, బొటనీ పేపర్1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1
-ఏప్రిల్ 29న మాథ్స్ పేపర్ 1B జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్1
-మే2 న ఫిజిక్స్ పేపర్ 1, ఎకానమిక్స్ పేపర్1
-మే 6న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్..

-ఏప్రిల్ 23న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్ 2,
-ఏప్రిల్ 26 న ఇంగ్లిష్‌ పేపర్ 2
-ఏప్రిల్ 28న మాథ్స్ పేపర్ 2A, బోటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2,
-ఏప్రిల్ 30న మాథ్స్ పేపర్ 2B, జూవాలజీ పేపర్2, హిస్టరీ పేపర్ 2
-మే 5న ఫిజిక్స్ పేపర్ 2, ఎకానమిక్స్ పేపర్ 2,
-మే 7న కెమిస్ట్రీ పేపర్2, కామర్స్ పేపర్2

- Advertisement -