- Advertisement -
కష్టకాలంలో ప్రజలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం బంజర క్రాస్ రోడ్డు వద్ద వలస కూలీలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కరోనా నిర్మూలన జరిగే వరకు ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల క్షేమం కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారని వెల్లడించారు.
వలస కూలీలను కన్న బిడ్డలు గా కాపాడుకుంటామని..కష్టకాలం వచ్చింది. ప్రజలంతా సంయమనంతో ఉంటూ, ప్రభుత్వానికి సహకరించాలన్నారు. లాక్ డౌన్ ను పాటిస్తూ, తమను తాము రక్షించు కుంటూనే, దేశాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు ఎర్రబెల్లి.
- Advertisement -