కొత్త దర్శకుడితో దొరసారి హీరో..!

217
anand devarakonda

దొరసాని సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో ఆనంద్ దేవరకొండ. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఆరంగేట్రం చేసిన ఆనంద్…తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఆనంద్‌…సెకండ్ సినిమా ప్రస్తుతం సెట్స్‌ పై ఉంది. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్ పడగా తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టీ టౌన్ వర్గాల టాక్.

ఈ మూవీతో దామోదర అట్టాడ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయమవుతుండగా విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కథానాయికతో పాటు ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.