వీవీ ప్యాట్‌ల కోసం గోడౌన్ల నిర్మాణం పూర్తి చేయాలి..

249
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలోని 23 నూతన జిల్లాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, వి వి ప్యాట్ లను భధ్రపరచడానికి అవసరమైన గోడౌన్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అధికారులను ఆదేశించారు. గోడౌన్ల నిర్మాణాలకు సంబంధించి ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా సీనియర్ కన్ సల్టెంట్ భన్వర్ లాల్, సిఈఓ రజత్ కుమార్ లు గురువారం సచివాలయంలో సి.యస్‌ను కలిసారు.ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామ కృష్ణారావు, ఆర్ అండ్ బి ఈఎన్ సి గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం గోడౌన్లను జిల్లా అవసరాలను దృష్ఠిలో ఉంచుకొని నూతన కలెక్టరేట్‌లలో నిర్మించేలా చూడాలన్నారు. గోడౌన్ల నిర్మాణాలను వచ్చే మే నెలాఖరునాటికి పూర్తి చేయాలన్నారు. ఆర్ అండ్ బి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందని, భవిష్యత్ అవసరాలను దృష్ఠిలో ఉంచుకొని నిర్మాణాలను చేపట్టాలన్నారు.

ములుగు, నారాయణపేట్ జిల్లాలలో గోడౌన్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. మిగిలిన 21 జిల్లాలలో 19 ఆర్ అండ్ బి ద్వారా,1 విద్యాశాఖ, 1 పంచాయతీ రాజ్ శాఖ ద్వారా పనులు చేపడుతున్నారు, ఆర్ అండ్ బి ద్వారా 8 చోట్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని, 5 చోట్ల టెండర్లు ఫైనలైజ్ అయ్యాయని 3 ప్రాసెస్‌లో ఉన్నాయని, 2 రివైజ్ డ్ అనుమతి దశలో ఉన్నాయని అన్నారు. ప్రతి జిల్లాలో ఓటర్ల సంఖ్య, ఈవిఎం ల సంఖ్య, అవసరమైన స్ధలం, నిర్మాణ వ్యయం, అనుమతులు, టెండర్లు తదితర అంశాలతో నివేధిక రూపొందించాలని సి.యస్ అధికారులను కోరారు.

- Advertisement -