అయోధ్య కేసు..చరిత్ర

509
ayodhya case
- Advertisement -

ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో,వివాదంలో ఉన్న సున్నితమైన అయోధ్య రామజన్మభూమి అశంపై సుప్రీం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. హేతుబద్ద ధోరణిలో,సాక్ష్యాధారాల ఆధారంగా తీర్పువెలువరించిన న్యాయస్ధానం వివాదాస్పద భూమిలో రాముడి గుడికట్టాలని తేల్చిచెప్పింది.

()1885లో బాబ్రీ మసీదు ప్రాంగణంలోని రామ్‌ఛబుత్ర ప్రాంతంలో రామ మందిరం నిర్మాణానికి అనుమతి కోరుతూ  ఫైజాబాద్ జిల్లా కోర్టులో వ్యాజ్యం

()1949లో మసీదులో రాముడు, సీతాదేవి విగ్రహాల్ని ప్రతిష్టించారంటూ పోలీసు కేసు నమోదు

()1950 జనవరిలో.. కోర్టులో మరో పిటిషన్ దాఖలు

()సీజ్‌ చేసిన ప్రాంతాన్ని తెరిపించి పూజలకు అనుమతించాలని పిటిషన్

()బాబ్రీ మసీదు తమ ఆస్తి అంటూ 1961లో ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు పిటిషన్‌

() 1961లో బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీ ఏర్పాటు

()1989లో బాబ్రీ మసీదు-రామ జన్మభూమి వివాదానికి సంబంధించిన కేసులన్నీ అలహాబాద్‌ హైకోర్టుకు బదలాయింపు

()2002 ఏప్రిల్‌లో అయోధ్య స్థల యాజమాన్యంపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ

()2010లో అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద స్థలాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి.. రెండు భాగాలు హిందువులకు, ఒక భాగాన్ని ముస్లింలకు పంచాలంటూ చారిత్రక తీర్పు వెల్లడి

() 2011లో అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు నిలుపుదల

()2017 డిసెంబర్‌లో  జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏర్పాటు

()సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఖలీఫుల్లా నేతృత్వంలో శ్రీశ్రీ రవిశంకర్, శ్రీరామ్‌పంచు సభ్యులుగా మధ్యవర్తుల కమిటీ ఏర్పాటు

()చివరిగా సుప్రీం ధర్మాసనం వివాదాస్పద స్థలం హిందువులదేనంటూ తీర్పు  వెల్లడి

- Advertisement -