Donald Trump: మస్క్‌కు కీలక పదవి ఇస్తా

6
- Advertisement -

మరోసారి తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాన్‌ మస్క్‌కు కీలక పదవి ఇస్తానని రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ వెల్లడించారు. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ , డెమోక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ పోటీపడుతున్నారు. ప్రచారంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

ఇక ట్రంప్‌కు మొదటి నుండి మద్దతు ప్రకటిస్తున్నారు ఎలాన్ మస్క్. ఇటీవలె ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా చేశారు. తాను అధ్యక్షుడిననైతే ట్రంప్‌కు తన కేబినెట్‌లో చోటు కల్పిస్తానని లేదంటే సలహాదారుడిగానైనా నియమించుకుంటానని స్పష్టం చేశారు. ట్రంప్‌ ఆఫర్‌పై ఎలాన్‌ మస్క్‌ కూడా స్పందించారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీకి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

Also Read:సీఎం రేవంత్‌ రెడ్డితో గవర్నర్ దత్తాత్రేయ భేటీ

- Advertisement -