టీ ఆర్ ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్షః కేటీఆర్

506
Ktr
- Advertisement -

తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ తన సొంత నియోజకవర్గంలో సిరిసిల్లలో పర్యటించారు కేటీఆర్. సిరిసిల్ల పట్టణంలో రూ.3.60కోట్లతో నిర్మించిన జిల్లా కేంద్ర గ్రంధాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇంత గొప్ప గ్రంధాలయం రాష్ట్రంలో ఎక్కడా లేదన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటిది సిరిసిల్ల సినారే లైబ్రరీ అన్నారు. ఈ గ్రంధాలయాన్ని ఉద్యోగ , ఉపాధ్యయ సంఘాల ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Ktr Siricilla Librarey

కవులు, కళాకారులు కూడా లైబ్రరీని వేదికగా వాడుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ గంధ్రాలయానికి సినారె పేరు పెట్టడం ఆయనకు నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య పలువురు ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సిరిసిల్ల లోని టీఆర్ఎస్ కార్యకర్తలతో భేటీ అయ్యారు కేటీఆర్. 2001లో టీఆర్ఎస్ చిన్న మొక్కగా ఉండేదని కానీ ఈరోజు ఒక వృక్షంగా మారిందన్నారు.

ఆ రోజు మన పార్టీ కార్యాలయన్ని చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని చెప్పారు. ఈసందర్భంగా సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయానికి 2లక్షల 50వేలు విరాళంగా ఇచ్చారు. పార్టీ కార్యాలయాన్ని దసరాలోపు పూర్తి చేసుకొని ప్రారంభింస్తామని చెప్పారు. సభ్యత్వ నమోదు లో అన్ని కాలాలు పూర్తి చేయాలి, ఆధార్ నంబర్ తప్పక రాయాలి,విధిగా,ఫోటో,సెల్ నంబర్ రాయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త బయోడెటా మా దగ్గర ఉంటుందని చెప్పారు. సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిని అందరూ ప్రసంశిస్తున్నారని తెలిపారు. త్వరలో మునిసిపాలిటి ఎన్నికలు వస్తాయి.. జెడ్పీ ఎన్నికల తరహాలో మునిసిపాలిటి ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

- Advertisement -