మాఫియా డాన్ గా శర్వానంద్.. ఆసక్తిరేపుతున్న రణరంగం టీజర్..(వీడియో)

215
Ranarangam
- Advertisement -

హీరో శర్వానంద్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా రణరంగం. ఈసినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా  సితార బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈమూవీలో శర్వా సరసన కాజల్ , కళ్యాణి ప్రియదర్శన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈసినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

కాగా తాజాగా ఈచిత్ర టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. “దేవుణ్ణి నమ్మాలంటే భక్తి వుంటే సరిపోతుంది .. కానీ మనుషుల్ని నమ్మాలంటే ధైర్యం కావాలి’ అంటూ శర్వానంద్ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ మొదలైంది. 1990 నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా నిర్మితమైంది. ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే ఆశాభావంతో శర్వానంద్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

- Advertisement -