కేటీఆర్‌ యుగపురుషుడు : ఎంపీ రంజిత్‌రెడ్డి

34
ranjith
- Advertisement -

టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి ప్రశంసలు కురిపించారు. కేటీఆర్‌కు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను రంజిత్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. కేటీఆర్‌ ఓ యుగ పురుషుడు అని కొనియాడారు.

నిబద్ధత, చిత్తశుద్ధికి ప్రతిరూపం.. యువతరానికి కేటీఆర్‌ గొప్ప స్ఫూర్తి. 140 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతిని కూడా సమయానుగుణంగా కొట్టగలడు. అద్భుతమైన ఐడియాలను సృష్టిస్తాడు. ఐడియాలను ప్రచారం చేస్తాడు. అందరితో అనుబంధాలను పంచుకుంటాడు. కుటుంబం కోసం నిలబడుతాడు. అలాంటి అద్భుతమైన వ్యక్తి కేటీఆర్‌కు సెల్యూట్‌.. అంటూ ఓ వీడియోను ఎంపీ రంజిత్‌ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు అడ్వాన్స్‌గా హ్యాపీ బర్త్‌డే విషెస్‌ తెలిపారు. కేటీఆర్‌ ఈ వీడియోను రీ ట్వీట్‌ చేస్తూ ఎంపీ రంజిత్‌ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -