జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా : కలర్‌ ఫోట్‌!

75
color photo
- Advertisement -

2020వ ఏడాదికి గాను కేంద్రం 68వ జాతీయ సినిమా అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. సుహాస్‌, చాందినీ చౌద‌రి న‌టించిన క‌ల‌ర్ ఫోటో (Colour photo) జాతీయ ఉత్త‌మ తెలుగు చిత్రంగా ఎంపికైంది. అలాగే ఉత్తమ కోరియోగ్రఫీ చిత్రంగా నాట్యం, ఉత్తమ సంగీత చిత్రంగా అల వైకుంఠపురములో చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. ఈ ఏడాది మొత్తం 30 భాషల్లో 305 ఫీచర్ ఫిల్మ్స్ ఎంట్రీకి వచ్చాయి. అలాగే నాన్‌ ఫీచర్స్ ఫిల్మ్‌ కేటగిరిలో 148 చిత్రాలు స్క్రీనింగ్‌కు వచ్చినట్లు జ్యూరీ మెంబర్స్ తెలిపారు. ఈ ఏడాది అవార్డులను ఐదు కేటగీరీలుగా విభజించారు. దాదా సాహెబ్‌ అవార్డు, ఫీచర్‌ ఫిల్మ్, నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌, బెస్ట్ రైటింగ్‌ సెక్షన్‌, మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్‌ కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు.

- Advertisement -