వైర‌ల్ గా మారిన‌ కేటీఆర్, ఎన్టీఆర్ ఫోటో..

328
viral Pic Jr NTR With KTR
- Advertisement -

ప్ర‌స్తుత రోజుల్లో ఇద్ద‌రు సెల‌బ్రెటీలు క‌లిస్తే చాలు సోష‌ల్ మీడియాలో వాళ్ల ఫోటోలు వైర‌ల్ గా మారుతున్నారు. అది సినిమా స్టార్స్ అయినా, రాజ‌కీయ నాయ‌కులైన వాళ్లు ఫోటోలు క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఇక తాజాగా టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

ntr ktr

రీసెంట్‌గా, కేటీఆర్, ఎన్టీఆర్ ఇద్దరూ విడివిడిగా ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అనుకోకుండా వారు కామ‌న్ ఫ్రెండ్స్ ద్వారా క‌లిసి ఫోటోల‌కు ఫోజులిచ్చారు. కేటీఆర్, ఎన్టీఆర్ కలిసున్న ఈ ఫోటో రాజకీయ వర్గాలతో పాటు, సినీ పరిశ్రమ మరియు నందమూరి అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చలకు దారి తీస్తుంది. నంద‌మూరి సుహాసిని ఎన్టీఆర్ అక్క ఇటివ‌లే జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూక‌ట్ ప‌ల్లి నుంచి పోటీ చేసి ఓట‌మిపాల‌యిన విష‌యం తెలిసిందే. ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ – కేటీఆర్ లు ఒకే వేదికపై ఇలా దర్శనమివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

- Advertisement -