హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన‌ మహమూద్ అలీ..

264
mahamooda ali
- Advertisement -

రాష్ట్ర హోంమంత్రిగా ఇవాళ ప‌ద‌విబాధ్య‌త‌లు స్వీక‌రించారు మ‌హ‌మూద్ అలీ. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు నాంపల్లిలోని యూసుఫైన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతంర సచివాలయంలోని డీ బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ali

ఈకార్య‌క్ర‌మానికి మాజీ హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి, డీజీపీ మహేంద‌ర్ రెడ్డి, పోలీసు ఉన్నాతాధికారులు ప‌లువురు నేత‌లు క‌లిసి ఆయ‌న‌కు శుభాకాంక్షాలు తెలిపారు. గత నాలుగేండ్లలో రాష్ట్రంలో నెల‌కొన్న ప్ర‌శాంత వాతావ‌ర‌ణాన్ని కొనసాగేలా చూస్తాన‌ని హామి ఇచ్చారు. పోలీసులంటే ప్ర‌జ‌ల‌కు భ‌యం లేకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప‌నిచేస్తామ‌ని చెప్పారు.

- Advertisement -