గెలుపు నాదే..ఓటేసిన వారికి ధన్యవాదాలు:పోచంపల్లి

519
pochampalli srinivas reddy
- Advertisement -

రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతుంది. ఇప్పటివరకు వరంగల్‌లో 90 శాతం పోలింగ్ నమోదైందని వరంగల్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేసిన ఆయన తనకు ఓటేసిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు తెలిపారు.

ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. వరంగల్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్‌ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుండి వెంకట్రామి రెడ్డి తోపాటు మరో ముగ్గురు స్వతంత్రులు బరిలో ఉన్నారు.

మొత్తం 902 మంది ఓట‌ర్లు ఉండగా అందులో 513 మంది మహిళా ఓటర్లు 389 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మొత్తం పది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

- Advertisement -