హుజుర్ నగర్ లో టీఆర్ఎస్ దే విజయం

470
Minister Jagadish Reddy
- Advertisement -

హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఏకపక్షమే అన్నారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. శానంపూడి సైదిరెడ్డి గెలుపుపై తాము ధీమాగా ఉన్నామని ..మెజార్టీ ఎంత అన్నదే ప్రధాన అంశం అన్నారు. నేడు హుజుర్ నగర్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. గత ఎన్నికల్లో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటామనీ, కాంగ్రెస్ నేతలంతా కలిసి వచ్చినా టీఆర్‌ఎస్ విజయాన్ని ఆపలేరని ఆయన అన్నారు. హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో గత అసెంబ్లీ, స్థానిక సంస్థలు ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ లో స్ధానికేతరుడని..ఇక నుంచి ఆయన ఆటలు ఇక్కడ సాగవన్నారు. హుజుర్ నగర్ లో బీజేపీ అసలు పోటీయే ఇవ్వదన్నారు. టీఆర్ ఎస్ గెలిపించుకునేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొంది, అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమయింది.

హుజూర్ ఉప ఎన్నికలు అక్టోబర్ 21న జరుగనున్నాయి. ఈ ఉప ఎన్నికకు సెప్టెంబర్ 23న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేది సెప్టెంబర్ 30. నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్ 3. పోలింగ్ అక్టోబర్ 21న, ఓట్ల లెక్కింపు అక్టోబర్ 24న జరుగనుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గతసారి ఇదే అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డి పోటీలో ఉన్నారు.

- Advertisement -