వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమే విజయదుంధుభి మోగించనుందని అన్నారు పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ . 2019లో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటందని తెలిపారు.
ఇవాళ ఆమె ఢిల్లీలో వివిధ పార్టీ నేతలను కలుసుకున్నారు. ఎన్డీయేపై వ్యతిరేకను వ్యక్తం చేస్తూనే.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా మరో ఫ్రంట్‌ను తీసుకురావాలన్న ఉద్దేశంతో దీదీ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాగా..ఈ రోజు ఢిల్లీలో ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ ఎంపీ మీసా భారతిలతో పాటు పలువురు నేతలతో మమత చర్చించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మమత , 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలు చాలా ఆసక్తిగా ఉంటాయని తెలిపారు.
ఇదిలా ఉండగా.. మరికాసేపట్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో చర్చించి, ఆ తరువాత ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తోనూ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.
West Bengal Chief Minister Mamata Banerjee met NCP Chief Sharad Pawar in Delhi pic.twitter.com/WHqJfA7MW0
— ANI (@ANI) March 27, 2018