టీఆర్ఎస్ సభ….పార్కింగ్ స్థలాలివే

166
trs meeting
- Advertisement -

ఎల్బీస్టేడియంలో సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ భారీ బహిరంగసభ జరగనున్న సంగతి తెలిసిందే. బహిరంగసభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తికాగా సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యం, సీఎం కేసీఆర్ పాల్గొనే ఏకైక సభ కావడంతో టీఆర్ఎస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేశాయి. ఒక్కో డివిజన్ నుండి 3 వేల మందిని తరలించేలా ఏర్పాట్లు చేశారు.

టీఆర్ఎస్ బహిరంగసభ…..పార్కింగ్ స్థలాలివే

ఏ రూటు నుంచి వచ్చేవారు వారికి కేటాయించిన స్థలాల్లోనే వాహనాలను పార్కింగ్‌ చేయాలని పోలీసులు సూచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ ఛైర్మన్లు, సాంస్కృతిక కార్యక్రమాల బృందాలు గేట్‌ – డి, ఇ వద్ద ఆగాలి, సాట్స్‌ కార్యాలయం నుంచి లోపలికి వెళ్లాలి. తమ వాహనాలను ఎస్‌సీఆర్టీ, ఎస్‌ఎస్‌ఏ, అగ్రికల్చర్‌ అఫీస్‌, అలీ మోడల్‌ స్కూల్‌, మెహబూబ్‌ కాలేజీ, నిజాం కాలేజీ గ్రౌండ్‌లో పార్కు చేసుకోవాలి.

()కార్పొరేటర్లు, మీడియా సిబ్బంది గేట్‌ బి వద్దకు వచ్చి ఆగాలి. పీసీఆర్‌ జంక్షన్‌, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌, ఖాన్‌ లతీఫ్‌ ఖాన్‌ బిల్డింగ్‌ జంక్షన్‌, బి-గేట్‌ ద్వారా లోపలికి రావాలి. తమ వాహనాలను స్టాన్లీ స్కూల్‌, స్టాన్లీ కాలేజ్‌, హాజ్‌ హౌస్‌ పార్కు చేసుకోవాలి.

()సికింద్రాబాద్‌, ట్యాంక్‌బడ్‌ నుంచి వచ్చే వాహనాలు ఎల్బీస్టేడియం జి-గేట్‌ వద్దకు వచ్చి అగాలి, సభకు వచ్చే వారు గేట్‌ 14, 15 నుంచి లోపలికి

రావాలి. వాహనాలు పబ్లిక్‌ గార్డెన్‌, రవీంధ్రభారతి, ఐమాక్స్‌ ధీయేటర్‌ పక్కనే ఉన్న డాక్టర్‌ కార్స్‌ పార్కింగ్‌లో పార్కు చేసుకోవాలి.

()మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు గేట్‌ – జి వద్ద ఆగాలి, 14, 15 గేట్ల ద్వారా సభకు లోపలికి వెళ్లాలి, వాహనాలను నిజాం కాలేజీ గ్రౌండ్‌ 2, 3లో పార్కు చేయాలి.

()ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఓల్డ్‌సిటీ వైపు నుంచి వచ్చే వాహనాలు ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ వద్ద ఆగాలి, లోపలికి గేట్‌ ఎ, 16, 17 నుంచి వెళ్లాలి.వాహనాలను పబ్లిక్‌గార్డెన్‌, పిపుల్స్‌ ప్లాజాలో పార్కు చేయాలి.

()ముషీరాబాద్‌, అంబర్‌పేట్‌, హిమాయత్‌నగర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు గేట్‌ ఎఫ్‌, ఎఫ్‌-1, జీ వద్ద వద్ద ఆగాలి, గేట్‌ నెం. 6, 7, 8 9,

10 నుంచి లోపలికి వెళ్లాలి. వాహనాలు నిజాం కాలేజీ గ్రౌండ్‌ – 2, 3లో పార్కు చేయాలి.

()ద్విచక్రవాహనాలు, కార్లపై వచ్చే వాళ్లు గేట్‌ ఎ, ఎఫ్‌, ఎఫ్‌ 1, జి వద్ద ఆగాలి. గేట్‌ నెం. 6, 7,8,9,10 నుంచి లోపలికి వెళ్లాలి. పార్కింగ్‌ స్థలం నిజాం కాలేజీ గ్రౌండ్‌ – 1.

- Advertisement -