ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్..

263
cm kcr
- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీలో 5, తెలంగాణలో 5 స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ వివరాలు ప్రకటించింది. అయితే తెలంగాణలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

హోంమంత్రి మహముద్‌ అలీ, ఎండీసీ చైర్మన్‌ శేరి సుభాష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురమలను టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులుగా సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. మరొక సీటును మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

ఈనెల 28వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. మార్చి 1న నామినేషన్ల పరిశీలన, 5న ఉపసంహరణ ఉంటుంది. మార్చి 12న పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహిస్తారు.

(కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రసంగం-హైలెట్స్‌..https://goo.gl/rFf6Jz)

- Advertisement -