దర్శకుడు కోడి రామకృష్ణ ఇకలేరు..

241
Kodi Ramakrishna
- Advertisement -

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఇకలేరు. కొంత కాలంగా శ్వాసకోశవ్యాధితో ఆయన బాధపడుతున్నారు. హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు. గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన పలు, తమిళ, మలయాళ, హిందీ సినిమాలనూ తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోలందరితోనూ ఆయన సినిమాలు రూపొందించారు.

2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వ వహించలేదు. వందకు పైగా చిత్రాలకు రామకృష్ణ దర్శకత్వం వహించారు. రామకృష్ణ మృతితో టాలీవుడ్‌లో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -