హైదరాబాద్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నల్గొండలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో టీఆర్‌ఎస్ పార్టీ ముందంజలో ఉంది. తొలి నాలుగు రౌండ్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 15,438 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న, మూడోస్థానంలో కోదండరామ్ కొనసాగుతున్నారు.
ప్రస్తుతం నాల్గొవ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. నాల్గొవ రౌండ్‌లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి దూసుకుపోయారు. నాల్గొవ రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15,897 ఓట్లు పోలవ్వగా సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 12,146, ప్రొఫెసర్ కొందరామ్‌కు 10,048, ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ)కి 5,099, రాములు నాయక్(కాంగ్రెస్)కు 4,003 ఓట్లు పోలయ్యాయి. చెల్లని ఓట్లు 3,223 ఉన్నాయి. ఇప్పటివరకు లెక్కించిన నాలుగు రౌండ్లలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 63,442 ఓట్లు. తీన్మార్ మల్లన్నకు 48,004, కోదండరామ్‌కు 39,615, ప్రేమేందర్‌రెడ్డి(బీజేపీ)కి 23,703, రాములు నాయక్(కాంగ్రెస్)కు 15,934 ఓట్లు రాగా.. నాలుగు రౌండ్లలో చెల్లని ఓట్లు 12,475. ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.