వింటే చెవులు మూసుకుంటారు.. బూతులు తిట్టిన సాయిప‌ల్ల‌వి..!

201
Sai Pallavi
- Advertisement -

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా ద‌గ్గుబాటి-సాయిప‌ల్ల‌వి జంటగా నటిస్తున్న చిత్రం విరాట‌ప‌ర్వం. సుధాక‌ర్ చెరుకూరితో క‌లిసి సురేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుండి విడుదలైంది. టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక టీజర్‌ విషయానికొస్తే… ఆదిప‌త్య జాడ‌ల‌నే చెరిపేయ‌గ ఎన్నినాళ్లు తార‌తమ్య గోడ‌ల‌నే పెకిలించ‌గా ఎన్నినాళ్లు అంటూ అర‌ణ్య (‌రానా పేరు) విప్ల‌వ క‌విత్వాన్ని రాసే సన్నివేశంతో టీజ‌ర్ షురూ అయింది.

అర‌ణ్య క‌విత్వాన్ని చ‌ద‌వి అత‌ని ప్రేమ‌లో ప‌డిన యువ‌తిగా సాయిప‌ల్ల‌వి కనిపిస్తుండ‌గా..ఆ త‌ర్వాత పోరాట స‌న్నివేశాల‌తో టీజ‌ర్ సాగుతుంది. ఓ వైపు ప్రేమ, మ‌రోవైపు పోరాటాన్ని సిల్వ‌ర్ స్క్రీన్ పై ఎలా చూపిస్తాడ‌న్న‌ది ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఈ మూవీలో సాయిచంద్ , న‌వీన్ చంద్ర,‌ ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్ కీల‌క ‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు.

- Advertisement -