మహిళా శిశు సంక్షేమానికి ‘కేసీఆర్ కిట్’..!

227
Trs Government New Scheme To Kcr Kit
- Advertisement -

2017-18 తెలంగాణ బడ్జెట్‌లో మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. మాతృమూర్తులైన మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం మానవీయ కోణం నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 100 శాతం ప్రసవాలు జరిగే విధంగా చూడాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తల్లీబిడ్డలకు అవసరమైన వస్తువులతో కేసీఆర్ కిట్‌ను అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ కిట్ పథకం కోసం బడ్జెట్‌లో రూ. 605 కోట్లు కేటాయించారు. శిశువుకు ఉపయోగపడే 16 వస్తువులతో కేసీఆర్ కిట్‌ అందిస్తారు.

ఆస్పత్రుల్లో గర్భిణీలు ప్రసవం అనంతరం రూ. 12వేలు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. డిశ్చార్జి అయిన వెంటనే గర్భిణీలకు రూ. 4 వేలు ఇవ్వనున్నారు. శిశువులకు పోలియో టీకాలు వేసినప్పుడు మరో 4 వేలు ఇస్తారు. మొత్తంగా మూడు విడతల్లో రూ. 12 వేలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆడడబిడ్డ పుడితే మరో వెయ్యి అదనంగా ఇస్తామని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. తల్లికి కూడా మూడు నెలలకు అవసరమైన వస్తువులను కిట్ రూపంలో ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -