రాష్ట్ర పండుగలుగా రంజాన్‌, క్రిస్మస్‌..

238
Etela Rajender To about state festivals
- Advertisement -

2017-18 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌. కొత్త బడ్జెట్‌లో వ్యవసాయానికి కీలక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు.. రైతుల రుణమాఫీకి బడ్జెట్‌లో రూ.4వేల కోట్లు కేటాయిస్తున్నామని, ప్రభుత్వం ఇచ్చిన హామీ ఈ ఏడాదితో పూర్తవుతుందని ఈటల స్పష్టం చేశారు.

తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.  తాజా బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి రూ.23,675కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు.

ఇక 2017-18 ఏడాదికి గాను తెలంగాణ ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో మాట్లాడుతూ రంజాన్‌, క్రిస్మస్‌‌‌‌ పండుగల‌‌ను రాష్ట్ర పండుగలుగా ప్రకటించారు. ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు ఇస్తామన్నారు. తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేస్తామన్నారు. అంతే కాకుండా హైదరాబాద్‌లో కొత్త మూడు మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కరీంనగర్‌లో మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్నారు.

- Advertisement -