లగడపాటిపై ఈసీకి ఫిర్యాదు..

226
lagadapati
- Advertisement -

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై ఈసీకి ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్. తెలంగాణలో 10 మంది స్వతంత్రులు గెలవబోతున్నారని లగడపాటి ప్రకటించడం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా ఉన్నాయని టీఆర్ఎస్ నేత దండె విఠల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తిరుపతిలో లగడపాటి చేసిన ప్రకటనను టీవీల్లో ప్రసారం చేశారని వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా సర్వే పేరుతో ఓటర్లను ప్రభావితం చేసేలా వివరాలను ఉద్దేశపూర్వకంగానే బయటపెట్టారని తెలిపారు. సర్వే వివరాలు ప్రకటించటం ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు .రోజుకు ఇద్దరు ఇండిపెండెంట్లకు సంబంధించిన ఫలితాలను వెల్లడిస్తానని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు.

మరోవైపు లగడపాటి సర్వే పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మహాకూటమి కుట్రలో భాగంగానే లగడపాటి సర్వేను వెల్లడించారని దుయ్యబట్టారు ఎంపీ బూర నర్సయ్య గౌడ్. పాక్షికంగా లగడపాటి వెల్లడించిన అంశాలు ఓటర్లను గందరగోళ పర్చే విధంగా ఉందన్నారు.

- Advertisement -