ఫ్యామిలీ సాంగ్‌తో వస్తున్న వినయ విధేయ రాముడు

274
ram charan vinaya videya rama
- Advertisement -

రంగస్థలం అందించిన జోష్‌ మరింత స్పీడు పెంచాడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమా చేస్తున్నారు. మాస్‌,యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన బోయపాటి-చెర్రీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవల విడుదల చేసిన టీజర్‌,ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. తన మార్క్‌ మాస్,యాక్షన్‌ను ఏమాత్రం మిస్ కాకుండా బోయపాటి సినిమా ఎలాఉండబోతుందో చెప్పకనే చెప్పాడు. టీజర్‌ ద్వారా యాక్షన్‌ సీన్‌ని చూపించిన బోయపాటి తాజాగా ఫ్యామిలీ సాంగ్‌తో అలరించనున్నారు. డిసెంబర్ 3న సాయంత్రం 4 గంటలకు తందానే తందానే పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డీవీవీ దానయ్య ట్వీట్టర్ ద్వారా పోస్టర్‌ని విడుదల చేశారు.

ఇక టీజర్‌ ద్వారా రామ్‌చరణ్‌ చెప్పిన రామ్‌.. కొ..ణి..దె..ల డైలాగ్‌ ఎంత పాపులర్‌ అయిందో చెప్పనక్కర్లేదు. మరి ఫ్యామిలీ సాంగ్‌తో చెర్రీ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్‌చరణ్‌ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -