దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ – సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ లది హిట్ కాంబినేషన్ కానీ ఆ ఇద్దరి మధ్య ఇప్పుడు విబేధాలు రాజ్యమేలు తున్నాయి దానికి నిదర్శనమే త్రివిక్రమ్ పుట్టినరోజు న దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ . త్రివిక్రమ్ శ్రీనివాస్ – దేవిశ్రీ ప్రసాద్ ల కాంబినేషన్ లో వరుసగా నాలుగు చిత్రాలు వచ్చాయి, ఆ నాలుగు కూడా మంచి హిట్స్ అయ్యాయి . పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు అలాగే అల్లు అర్జున్ నటించిన జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలకు సంగీతం అందించాడు దేవిశ్రీ ప్రసాద్.
అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాల్లో సంగీత దర్శకునిగా దేవీని తీసుకోకుండా వేరే సంగీత దర్శకులకు అవకాశం ఇస్తున్నాడు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ కారణమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫెయిల్యూర్లో దేవి పాత్ర కూడా ఉందని పవన్ భావిస్తున్నాడట. కొన్నిసార్లు ఔట్ పుట్ తేడా కొట్టినప్పటికీ తన సంగీతంతో సినిమాను పైకి లేపగల సామర్థ్యం దేవి సొంతం. ‘జల్సా’ విషయంలో అలాగే చేశాడతను. ఆ రకంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు ఎక్స్ ట్రా ఎఫర్ట్ పెట్టలేదని పవన్ కినుక వహించాడట.
తాను ప్రత్యేకంగా అడిగినా కూడా చాలా మామూలు ఆల్బమ్ ఇచ్చాడని పవన్ డిజప్పాయింట్ అయ్యాడట. ఈ నేపథ్యంలోనే దేవిని పక్కన పెట్టమని తన మిత్రుడు త్రివిక్రమ్ కు పవన్ చెప్పినట్లు సమాచారం. ఇందులో భాగంగానే త్రివిక్రమ్ దేవీని దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు కూడా అనిరుద్ నే తీసుకున్నారు. త్రివిక్రమ్ దేవీల మద్య విభేదాలు ఉన్నాయన్నదానికి ఊతమిచ్చేలా నవంబర్ 7న పుట్టినరోజు జరుపుకుంటున్న మిగతా సెలబ్రిటీ లకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసాడు కానీ త్రివిక్రమ్ కు మాత్రం చెప్పలేదు దాంతో ఇద్దరి మధ్య విబేధాలు నిజమే అని రుజువు అయినట్టయింది.