CEC:ఎన్నికల వేళ ఐదు రాష్ట్రాల్లో పారదర్శక బదిలీలు…

49
- Advertisement -

దేశంలో రానున్న జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని ఐదు రాష్ట్రాలు అయిన తెలంగాణ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల సీఎస్‌లకు, రాష్ట్ర ఎన్నికల అధికారులకు నోటీసులు అందించారు. జూలై 31తేదీలోపు రాష్ట్రంలో పారదర్శకంగా బదిలీలు చేయాలని పేర్కొన్నారు.

Also Read: బీజేపీ ” ఇంటింటి ప్రచారం ” ప్రజాగ్రహం తప్పదా ?

స్థానికంగా ఏ ఒక్క అధికారి ఉండకుండా చూడాలని ఆదేశించింది. అంతేకాదు ఒకే చోట మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కూడా అధికారులను ఉంచవద్దని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో రాష్ట్ర ఎన్నికల అధికారి మినహాయింపులు ఇవ్వవచ్చని తెలిపింది. వీరిలో జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు, పోలీసు ఆఫీసర్స్‌, మరియు రెవెన్యూ అధికారులు ఉన్నారు. అధికారులకు బంధుప్రీతి లేవని డిక్లరేషన్‌ తీసుకోవాలని సూచించింది. అలాగే క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తులను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని పేర్కొన్నారు.

Also Read: ” పవన్ వారాహి “.. వచ్చేస్తోందోచ్ !

- Advertisement -