గత కొంత కాలం ఎడమొఖం పెడమొఖం పెట్టుకున్న పీసీసీ ఛీఫ్ రేవంత్‌రెడ్డి నల్గొండ జిల్లా నాయకుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ఇంఛార్జీ మాణిక్‌రావు ఠాక్రే తెలంగాణకు వచ్చారు. దీంతో నేడు గాంధీభవన్‌లో పలువురు కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యారు.
చాలా రోజుల తర్వాత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా గాంధీభవన్‌కు వచ్చారు. దీంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. కోమటిరెడ్డి మనసు మార్చుకొని రేవంత్‌తో కలిసి పనిచేద్దామని సిద్దమయిన వేళ…వరంగల్ జిల్లాకు చేందిన కాంగ్రెస్ నేత కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కోమటిరెడ్డి ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడంతో మరో సారి తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది.
పార్టీకి తీరని నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేసింది. పీసీసీ ఛీఫ్ జోక్యం చేసుకుంటూ…వ్యక్తిగత అంశాలు పార్టీ సమావేశంలో మాట్లాడవద్దని …ఏమైనా ఉంటే రాష్ట్ర ఇంఛార్జ్‌ను కలిసి మాట్లాడాలని సూచించారు. కేవలం ఇక్కడ సమావేశం ఎజెండాపైనా మాట్లాడాలని కొండా సురేఖకు కౌంటర్ ఇచ్చారు.
దాదాపు ఏడాది తర్వాత గాంధీభవన్‌కు వచ్చిన కోమటిరెడ్డి…సుదీర్ఘంగా రాష్ట్ర ఇంఛార్జ్‌తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మీడియా మాట్లాడుతూ..గాంధీభవన్‌కు రానని నేనేప్పుడూ చెప్పలేదు. జనవరి 26న జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటా. తెలంగాణలో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి తేవాలో మాణిక్రావు ఠాక్రేకు సలహాలు ఇస్తాన్నారు. ఖమ్మం సభ లాంటివి కాంగ్రెస్ గతంలో వందల్లో పెట్టింది. ఎన్ని సభలు నిర్వహించినా కేసీఆర్ ఏం చేయలేరు. అవసరమైతే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా అని అన్నారు.
ఇవి కూడా చదవండి…