Revanth:రేవంత్ రెడ్డిలో అంతర్మథనం!

58
- Advertisement -

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంతర్మథనంలో ఉన్నారా ? ఎన్నికల ముందు ఆయన చేసిన వ్యాఖ్యాలే శాపంగా మారయా ? ఆయన వంకర బుద్దిని ఆయనే బయట పెట్టుకున్నారా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి హస్తం పార్టీలో తెగ హడావిడి చేస్తున్నారు. ఈసారి అధికారంలోకి వచ్చేది తామేనని చెబుతూ కల్లబొల్లి కబుర్లతో లోన లొట్ట పైగా గట్ట అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి మాత్రమే ఎదోదో హడావిడి చేస్తూ ఇప్పటికిప్పుడే అధికారంలోకి వ్యవహరిస్తున్నారని చాలా మంది అభిప్రాయం. పార్టీలోని మిగిలిన చాలమంది సీనియర్లకు గెలుపు విషయంలో డైలమాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ హడావిడి అంతా కేవలం టీవి ప్రకటనల్లోనూ, ప్రచారల్లోనూ కనిపిస్తుంది తప్పా ప్రజల్లో లేదనేది ఆ పార్టీ నేతలకు బాగానే అర్థమౌతోంది. .

ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి వెలుతున్న హస్తం నేతలకు ఆశించిన స్థాయిలో ఆధారణ లభించడం లేదట. ఆరు గ్యారెంటీలు ఆరు హామీలు అని ఏవేవో చెబుతున్నప్పటికి కర్నాటక సంగతేంటి ? అని ప్రజలే ప్రశ్నించే పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో హస్తం నేతలు తెల్లమొఖం వేసుకొని జారుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక అటు టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి సైతం నోటికి వచ్చినట్లు ఇటీవల వ్యాఖ్యలు చేసి వాటిని ఎలా సవరించుకోవాలో తెలియని సందిగ్ధంలో పడిపోయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. గతంలో సి‌ఎం పదవిని డిసైడ్ చేసేది అధిష్టానం అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తానే సి‌ఎం అనేలా వ్యవహరిస్తున్నారు.

అలాగే నిన్న మొన్నటి వరకు కరెంట్ విషయంలో బి‌ఆర్‌ఎస్ సర్కార్ పై వేలెత్తి చూపిన రేవంత్ రెడ్డి కర్నాటకలో అమలవుతున్న 5 గంటల కరెంట్ సంగతేంటి ? అంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక కే‌సి‌ఆర్ సర్కార్ పై ఆధారంలేని అవినీతి ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిందేవరు ? అంటే బిక్కమొఖం వేసుకునే పరిస్థితి. ఇలా ఎన్నో అవినీతి మరకలు రవంత్ రెడ్డి చుట్టూ ఎన్నికల వేల మరింత చర్చకు వస్తుండడంతో కాంగ్రెస్ గెలుపు ఏమోగాని అయేనకే ఓటమి తప్పదా అనే భయం వెంటాడుతోందట. రేవంత్ రెడ్డిలో ఈ అంతర్మథనం ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:చలికాలంలో కీరదోస తింటే ఎన్నో ప్రయోజనాలో..!

- Advertisement -