రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్ధలం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి సంచలన రికార్డు సృష్టించింది. రాం చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మగధీరను దాటేసింది రంగస్ధలం సినిమా. అయితే ఇంత పెద్ద విజయం సాధించిన మూవీ కంటే ముందు స్ధానంలో భాగమతి సినిమా నిలిచింది. కలెక్షన్ల విషయంలో అనుకుంటున్నారా.. అస్సలు కాదు. ఫైరసీ విషయంలో తెలుగు సినిమాల్లో అత్యధిక సంఖ్యలో ఫైరసీ బారినపడిన సినిమాల జాబితాను ఓ జర్మని సంస్ధ తాజాగా విడుదల చేసింది.
ఫైరసి లో ఎక్కువ మంది చూసిన తెలుగు సినిమాల్లో భాగమతి నెం1 స్ధానంలో ఉంది. ఈసినిమాలో అనుష్క ముఖ్య పాత్రలో నటించింది. ఇక భాగమతి సినిమాను ఫైరసీలో 1.9మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకుని తొలి పది స్ధానాల్లో మొదటి స్ధానంలో నిలిచింది. ఆతర్వాత రెండవ స్ధానంలో రామ్ చరణ్ రంగస్ధలం సినిమాను 1.6మిలియన్ల మంది విక్షించారు.
ఇలా మొదటి స్ధానంలో భాగమతి, రెండవ స్ధానంలో రంగస్ధలం, ఆ తర్వాతి స్ధానాల్లో మహేశ్ నటించిన భరత్ అనే నేను, మహానటి, నా పేరు సూర్య నాఇల్లు ఇండియా, తొలిప్రేమ, ఛలో, అజ్ఞాతవాసి, జయసింహా, ఇలా మొదటి పది స్ధానాల్లో నిలవగా చివరి స్ధానంలో రవితేజ నటించిన టచ్ చేసి చూడు సినిమా చివరి స్ధానంలో నిలిచింది.