ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న ‘పంతం’ వ‌సూళ్లు..

200
pantham

గోపిచంద్ హీరోగా న‌టించిన పంతం సినిమా విడుద‌లైన మొద‌టి షో నుంచే మంచి టాక్ తో దూసుకెళ్తుంది. చాలా రోజుల త‌ర్వాత గోపిచంద్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ద‌ర్శ‌కుడు చ‌క్రి తెర‌కెక్కించిన ఈమూవీలో మెహ‌రిన్ హీరోయిన్ గా న‌టించింది. గోపిచంద్ 25వ  సినిమా భారీ విజ‌యం సాధించ‌డం ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు అభిమానులు. ఎమోష‌న్ తో పాటు మంచి మెసెజ్ తో కూడిన సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌రధం ప‌డుతున్నారు.

GOPICHAND pantham

విడుద‌లైన తొలి రోజు నుంచే మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది పంతం సినిమా. చాలా రోజుల త‌ర్వాత గోపిచంద్ కెరీర్ లో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈసినిమా తొలిరోజున 5.2 కోట్ల గ్రాస్ ను చేరుకోగా..3.22కోట్ల షేర్ ను వ‌సూలు చేసింది. తొలి రోజే భారీ స్ధాయిలో వ‌సూళ్లు రావ‌డంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు చిత్ర‌యూనిట్. ఇక నేడు రేపు వికెండ్ కావ‌డంతో మ‌రింత వ‌సూళ్లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని చెప్పుకొవ‌చ్చు. గోపిచంద్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హిట్ ఈసినిమాతో వ‌చ్చింద‌నే చెప్పుకోవాలి.