తుగ్లక్ నిర్ణయాలు.. నాగబాబు సెటైర్స్ !

45
- Advertisement -

ఏపీ రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. ఈ మద్య వైసీపీ సర్కార్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు చేస్తున్న పర్యటనలో విషాద ఘటనలు చేటు చేసుకోవడంతో రాజకీయ నాయకులు చేసే పర్యటనలపై ఆంక్షలు విధించేందుకు జీవో-1 ప్రవేశ పెట్టింది జగన్ ప్రభుత్వం. దీనిపై అటు టీడీపీ ఇటు జనసేన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. ఇలా ప్రతిపక్ష పార్టీలపై కక్ష పూరితంగా వ్యవహరించడం అవాంఛనీయం అంటూ వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు పవన్ చంద్రబాబు. ఇక ఆ మద్య పవన్ విశాఖ పర్యటనలో మరియు ఇప్పటం గ్రామ పర్యటనలో కూడా జగన్ సర్కార్ అడ్డంకులను సృష్టించిన సంగతి తెలిసిందే.

దాంతో ఇలా పవన్, చంద్రబాబు టార్గెట్ గా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు ఇరు పార్టీల నేతలు.. ఇక తాజాగా వైఎస్ జగన్ తీసుకొచ్చిన జీవో -1 పై జనసేన నేత కొణిదెల నాగబాబు తనదైన రీతిలో సెటైర్ల వర్షం కురిపించారు. త్వరలో ఏపీలో తీసుకునే తుగ్లక్ నిర్ణయాలు అంటూ ఓ ఫోటోను షేర్ చేశారు నాగబాబు.. ” రోడ్డు మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి అందువల్ల రోడ్డు ప్రయాణాలు రద్దు, కారు యాక్సిడెంట్లు అవుతున్నాయి కారులో ప్రయాణించకూడదు.. ఇంట్లో గ్యాస్ బండ పెళుతోంది గ్యాస్ వాడకూడదు, కరెంట్ షాక్ కొడుతోంది ఏపీలో కరెంటు రద్దు.. “.. అంటూ ట్విట్టర్ లో సెటైర్ల వర్షం కురిపించారు. మొత్తానికి ఏపీలో విపక్ష పార్టీలే టార్గెట్ గా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. మరి ఇప్పుడే తార స్థాయిలో ఉన్న పోలిటికల్ హిట్ ఎన్నికల సమయంలో ఇంకెంత రగులుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి…

ఏపీ బీఆర్ఎస్‌..దూకుడు పెంచిన కేసీఆర్

ఐటీ..బెంగళూరును దాటేసిన హైదరాబాద్‌

ఖమ్మంలో బీఆర్ఎస్ పొలికేక..

- Advertisement -