విషమంగానే తారకరత్న ఆరోగ్యం..

29
- Advertisement -

టాలీవుడ్‌ నటుడు తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలోని వైద్య బృందం తాజాగా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తారకరత్నకు ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నామని వివరించారు. కార్డియాలిజిస్ట్‌లు ఇంటెన్సివిస్ట్‌ ఇతర స్పెషలిస్ట్‌లు తారకరత్న ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నాం అని అస్పత్రి వర్గాలు ప్రకటనలో వివరించింది.

నారా లోకేశ్ కుప్పం నియోజకవర్గం నుంచి యువగళం పేరిట పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో కుప్పంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారయణ హృదయాలయకు తరలించారు.

ఇవి కూడా చదవండి…

తారకరత్నకు తీవ్ర అస్వస్థత

తారకరత్న..మెరుగైన చికిత్సకు బెంగళూరు

లోకేశ్ పాదయాత్ర.. ఎవరికి దడ ?

- Advertisement -