మార్కెట్‌లో మారుతున్న పసిడి ధరలు..

322
Gold rate

ఇతర పెట్టుబడుల విలువ భవిష్యత్తులో పడిపోవచ్చని భావిస్తున్న వారు బంగారంలో భద్రత ఉంటుందని వాటివైపు వెళతారు. అంతేకాకుండా భారతదేశంలో బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బంగారం ధరలు రోజు రోజుకు మారుతూ వస్తున్నాయి.

Gold

వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,300, విశాఖపట్నంలో రూ.39,350, ప్రొద్దుటూరులో రూ.37,000, చెన్నైలో రూ.37,710గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,520, విశాఖపట్నంలో రూ.36,200, ప్రొద్దుటూరులో రూ.34,410, చెన్నైలో రూ.36,140గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.47,600, విశాఖపట్నంలో రూ.48,900, ప్రొద్దుటూరులో రూ.47,400, చెన్నైలో రూ.51,200 వద్ద ముగిసింది.