వేసవిలో మొబైల్ ‘ఓవర్ హీట్’..తగ్గించండిలా!

26
- Advertisement -

వేసవిలో ఎలక్ట్రానిక్ వస్తువులు వేడెక్కడం సహజం ఎందుకంటే వాతావరణంలో పెరిగే ఉష్ణోగ్రత్తల కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా చాలా త్వరగా వేడెక్కుతుంటాయి. మొబైల్స్, కంప్యూటర్స్, టీవీలు.. ఇలా ప్రతిదీ కూడా వేడికి లోనవుతుంటాయి. మరి ముఖ్యంగా మొబైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నార్మల్ గా యూస్ చేసేటప్పుడు కూడా మొబైల్ ఎంతో కొంత వేడెక్కడం సహజం.. మరి వేసవిలో ఈ సమస్య ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా మొబైల్ ఓవర్ హీట్ కావడం వల్ల పర్ఫామెన్స్ తగ్గడం, ఫోన్ స్లో కావడం, బ్యాటరీ లైఫ్ తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వేసవిలో ఓవర్ హీట్ తగ్గించుకునేందుకు మొబైల్ లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ సమస్య తగ్గుతుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం !

* చాలమంది మొబైల్ లో నిత్యం డేటా ఆన్ చేసి ఉంచుతారు. అవసరం లేని టైమ్ లో కూడా డేటా ఆన్ చేసి ఉంచడం వల్ల మొబైల్ లో బ్యాక్ గ్రాండ్ లో ఇతర యాప్స్ రన్ అవుతుంటాయి. తద్వారా మొబైల్ ఓవర్ హీట్ అవుతుంది. కాబట్టి అవసరం లేని సమయాల్లో డేటా ఆఫ్ చేసుకోవడం మంచిది.

* కొంతమంది మొబైల్ లో బ్లూ టూత్, వైఫై, లొకేషన్ వంటి ఆప్షన్స్ ఎప్పుడు ఆన్ లోనే ఉంటాయి. వీటి వల్ల కూడా మొబైల్ ఓవర్ హీట్ కు లోనవుతుంది. కాబట్టి వీటిని కూడా తరచూ ఆఫ్ లో ఉంచుకోవాలి.

* మొబైల్ లో ఎన్నో యాప్స్ యూస్ చేస్తుంటాము. అయితే కొన్ని అవసరం లేకపోయిన మొబైల్ లో అలాగే ఉంటాయి. అలాంటి యాప్స్ కారణంగా మొబైల్ లో బ్యాక్ గ్రాండ్ ప్రాసెస్ జరుగుతుంటుంది. ఆ కారణంగా మొబైల్ ఓవర్ హీట్ అవుతుంది. కాబట్టి మొబైల్ లో డెవలపర్ ఆప్షన్ ఎనబెల్ చేసుకొని అందులో బ్యాక్ గ్రౌండ్ లిమిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిలో అవసరమైన మేరకు మాత్రమే యాప్స్ కు పర్మిషన్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఇతర యాప్స్ బ్యాక్ గ్రాండ్ లో రన్ అవకుండా ఆగిపోతాయి.

* ఇంకా మొబైల్ లో గేమ్స్ ఆడడం తగ్గించాలి. ఎందుకంటే గేమ్స్ కారణంగానే మొబైల్ ఓవర్ హీట్ అవుతుంది. కాబట్టి ఈ వేసవిలో వీలైనంత వరకు గేమ్స్ కు దూరంగా ఉండాలి.

ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వేసవిలో మొబైల్ ఓవర్ హీట్ నుంచి బయట పడవచ్చు.

Also Read:టీడీపీలో ‘ఉండి’ టికెట్ రచ్చ!

- Advertisement -