వణికిస్తున్న ‘చికెన్ ఫాక్స్ ‘..జాగ్రత్త!

15
- Advertisement -

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. విపరీతమైన ఎండల కారణంగా చాలమందిలో రోగనిరోదక శక్తి తగ్గుతుంది. తద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందులో భాగంగానే ప్రస్తుతం దేశంలో చికెన్ ఫాక్స్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చికెన్ ఫాక్స్ ను ఆటలమ్మ లేదా తట్టు అని కూడా అంటారు. ఈ వ్యాధి ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే పెద్దల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి కూడా ఈ వ్యాధి సోకుతుంది. చికెన్ ఫాక్స్ అనేది ‘వారిసెల్ జూస్టర్’ అనే వైరస్ కారణంగా వ్యాప్తి చెందుతుంది. దీని బారిన పడిన వారిలో చర్మంపై పొక్కులు, దద్దుర్లు ఏర్పడతాయి. .

ఈ పొక్కుల నుంచి కారే చీము రక్తం ద్వారా ఈ వ్యాధి ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి తట్టు బారిన పడిన వారికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఇంకా ఈ వ్యాధి సోకిన వారిలో అలసట, జ్వరం, నీరసం, ఒళ్ళు నొప్పులు, ఆకలి మందగించడం, తలనొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు పది నుంచి 15 రోజుల పాటు ఉంటాయి. కాబట్టి చికెన్ ఫాక్స్ బారిన పడిన వారు సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. సాధారణంగా ఈ వ్యాధి బారిన పడిన వారికి సొంత వైద్యం చేస్తుంటారు.

ఒళ్లంతా వేపాకు రసం పూయడం చేస్తుంటారు. అలాగే తినే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పటిస్తుంటారు. అయితే ఈ జాగ్రత్తలు కొంతవరకు మేలే అయినప్పటికి వైద్యుడిని సంప్రధించి సరైన వైద్యం తీసుకోవడం చాలా ముఖ్యం. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడిన వారికి మళ్ళీ ఈ వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువ ఎందుకంటే ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు శరీరం యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి. కాబట్టి తట్టు వ్యాధి మళ్ళీ వచ్చే ప్రమాదం ఉండదు.

Also Read:టీడీపీలో ‘ఉండి’ టికెట్ రచ్చ!

జాగ్రత్తలు

* రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లు పదార్థాలను ఎక్కువగా తినాలి. ఉదాహరణకు యాపిల్, బత్తాయి, కివీ, జామా వంటి పండ్లను ఎక్కువగా తినాలి.

* చికెన్ ఫాక్స్ బారిన పడినవారు వంకాయతో చేసిన వంటకాలకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే వంకాయతో చేసిన పదార్థాలు తినడం వల్ల శరీరంపై దురద పెరుగుతుంది. తద్వారా చర్మంపై ఉన్న పొక్కులు పుండ్లుగా మారే ప్రమాదం ఉంది.

* చికెన్ ఫాక్స్ ఉన్నవారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. అలాగే ఇతరులకు దూరంగా ఉండడం కూడా చాలా మంచిది.

- Advertisement -