జయలలిత సినీ ప్రస్థానం…

445
TN chief minister Jayalalithaa cinema career
- Advertisement -

పురచ్చి తలైవి ..అమ్మ.. ఈ రెండు పదాల అర్ధం ఒకటే ఐనా తమిళనాట ఈ పదాలకి పర్యాయ పదం.. ముఖ్య మంత్రి జయలలితే. కేవలం ముఖ్య మంత్రి గానే కాకుండా వ్యక్తిగత జీవితం లోకూడా ఆమె ఎన్నో ఒడి దుడుకులను ఎదుర్కొన్నారు…సహచర్య జీవితం వున్నా అంత ఆశా జనకం గా సాగ లేదు . ..బ్రాహ్మణ కుటుంబ నేపధ్యం అయినప్పటికీ …జీవితాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని జీవితంనుంచి నెగ్గుకొచ్చారు.

చెనై్నలోని చర్చ్‌ పార్క్‌ కాన్వెంట్‌లో విద్యాభ్యాసం చేశారు. కుటుంబానికి ఆర్థికంగా సహాయపడేందుకు తన 15వ ఏట జయలలిత సినిమాల్లో నటించడం ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు శ్రీధర్‌ రూపొందించిన ‘వెన్నిరాడై’తో జయలలిత నట జీవితాన్ని ప్రారంభించారు. తన మూడు దశాబ్డాల వెండితెర జీవితంలో జయలలిత తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 300 చిత్రాల్లో నటించారు. తన రాజకీయ గురువు ఎంజీ రామచంద్రన్‌, శివాజీ గణేశన్‌ సహా టాప్‌ హీరోలందరి సరసనా జయలలిత హీరోయిన్‌గా నటించారు. అయితే, ఎంజీఆర్‌తోనే ఆమె అత్యధిక సినిమాలు చేశారు.

ఈమె తొలి తెలుగు సినిమా ” మనుషులు మమతలు ” ఈమెను పెద్దతార స్థాయికి తీసుకెళ్లింది. 1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారముతోసత్కరించింది. ఈమె అవివాహిత గానే జీవితాన్ని గడిపారు.

అమ్మ నటించిన సినిమాలు..

** కథానాయకుని కథ(1965)

మనుషులు మమతలు(1965)
ఆమె ఎవరు? (1966)
ఆస్తిపరులు (1966)
కన్నెపిల్ల (1966)
గూఢచారి 116(1966)
నవరాత్రి (1966)
గోపాలుడు భూపాలుడు (1967)
చిక్కడు దొరకడు(1967)
ధనమే ప్రపంచలీల(1967)
నువ్వే (1967)
బ్రహ్మచారి (1967)
సుఖదుఃఖాలు(1967)
అదృష్టవంతులు(1968)
కోయంబత్తూరు ఖైదీ(1968)
తిక్క శంకరయ్య(1968)
దోపిడీ దొంగలు(1968)
నిలువు దోపిడి(1968)
పూలపిల్ల (1968)
పెళ్ళంటే భయం(1968)
పోస్టుమన్ రాజు(1968)
బాగ్దాద్ గజదొంగ(1968)
శ్రీరామకథ (1968)
ఆదర్శ కుటుంబం(1969)
కథానాయకుడు(1969)
కదలడు వదలడు(1969)
కొండవీటి సింహం(1969)
పంచ కళ్యాణి దొంగల రాణి (1969)
ఆలీబాబా 40 దొంగలు (1970)
కోటీశ్వరుడు (1970)
గండికోట రహస్యం(1970)
మేమే మొనగాళ్లం(1971)
శ్రీకృష్ణ విజయం(1971)
శ్రీకృష్ణసత్య (1971)
భార్యాబిడ్డలు(1972)
డాక్టర్ బాబు (1973)
దేవుడమ్మ (1973)
దేవుడు చేసిన మనుషులు (1973)
లోకం చుట్టిన వీరుడు(1973)
ప్రేమలు – పెళ్ళిళ్ళు(1974)

- Advertisement -