తండ్రి మాస్‌..కొడుకు క్లాస్‌..! మరి ఎలా..?

270
Title fixed for Naga Chaitanya - Kalyan Krishna film ?
- Advertisement -

పోయిన ఏడాదిలో  ‘సాహసం స్వాసగా సాగిపో’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన చైతూ… ఈ ఏడాదిలో మాత్రం ఇంకా తన సినిమాలేవీ రిలీజ్‌ అవలేదు. మరి ఎక్కువ సినిమాలకి కమిట్‌ అవడం ఎందుకనుకున్నాడేమో! సినిమా సినిమాకి గ్యాప్‌ ఇస్తూ..స్లోగా సాగిపోతున్నాడు నాగచైతన్య. ఇటీవలే వాలెంటైన్స్‌ డే రోజు  సమంత, చైతూల మధ్య ఎలాంటి ప్రేమ ఉందో తెలిసిపోయింది.  ప్రేమికుల రోజున ఈ ప్రేమ పక్షులే సోషల్‌ మీడియాలో హైలెట్‌ గా నిలిచారు.

ఇదిలా ఉంటే.. చైతూ నెక్ట్స్‌సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ కి చైతూ జోష్‌ పెంచనున్నాడు. కల్యాణ్ కృష్ణ- నాగచైతన్య కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతుందన్న విషయం తెలిసిందే. అయితే సినిమాకి ఎలాంటి టైటిల్‌ పెడితే బాగుంటుంది అనే డైలమాలో పడిపోయారు చిత్ర టీమ్‌. మొత్తానికి ఈ సినిమాకి ఓ టైటిల్ ని అనుకున్నారు.
ఈ సినిమాకి ‘అల్లరి అల్లుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు అదే టైటిల్ కు ఈ చిత్ర టీమ్‌ ఫిక్స్‌ అయ్యే అవకాశం ఉందనేది తాజా సమాచారం. గతంలో నాగార్జున కథానాయకుడిగా వచ్చిన ‘అల్లరి అల్లుడు’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో నాగ్ మాస్ లుక్ తో అదరగొట్టేశాడు. చైతూ మాత్రం ఇందులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్టైలీష్ లుక్ తో కనిపించనున్నాడని అంటున్నారు.
 Title fixed for Naga Chaitanya - Kalyan Krishna film ?
లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చైతూను కొత్తగా చూపించడానికి కల్యాణ్ కృష్ణ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడని చెబుతున్నారు. మరి నాగార్జున మూవీ మాదిరిగానే ఈ సినిమా కూడా హిట్ కొడుతుందో లేదో చూడాలి. మొత్తానికి ఈ చిత్ర టీమ్‌ ఇప్పుడు ‘అల్లరి అల్లుడు’  టైటిల్ నే ఓకే చేస్తే..  చైతూ సినిమాకు  తండ్రి సినిమా టైటిల్‌ రానుండటం విశేషంగా మారుతుంది.

- Advertisement -