ఫోన్ వేడెక్కుతుందా..ఈ టిప్స్ పాటించండి!

45
- Advertisement -

నేటి రోజుల్లో ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. చిన్న పిల్లలు గేమ్స్ ఆడడానికి, వీడియోస్ చూడడానికి మొబైల్ యూస్ చేస్తుంటే.. పెద్దలేమో ఆఫీస్ వర్క్, బ్యాంకింగ్ లావాదేవీలు జరపడానికి..ఇలా ఆయా అవసరాల నిమిత్తం ప్రతి దానికీ మొబైల్ వాడకం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ తరచూ వేడెక్కడం గమనిస్తుంటాం. ఇలా వేడెక్కడం వల్ల కొన్ని సందర్భాల్లో మొబైల్ పేలిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. అయితే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మొబైల్ వేడెక్కడాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. .

* సాధారణంగా మొబైల్ లో అవసరం యాప్స్ కూడా ఎన్నో ఉంటాయి. వాటిని యూస్ చేయక్పోయినప్పటికి బ్యాక్ గ్రాండ్ లో రన్ అవుతుంటాయి. తద్వారా మొబైల్ వేడెక్కే అవకాశం ఉంది. కాబట్టి అనవసర యాప్స్ ను మొబైల్ నుంచి డిలీట్ చేయాలి.

* కొంతమంది మొబైల్ లో బ్లూటూత్, వైఫై, లొకేషన్ వంటి ఫీచర్లను ఎల్లప్పుడు ఆన్ లో ఉంచుకుంటూ వుంటారు. ఇవి ఆన్ లో ఉండడం వల్ల కూడా మొబైల్ వేడెక్కే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని అవసరమైనప్పుడు ఆన్ లో ఉంచుతు అనవసర సమయాల్లో ఆఫ్ చేసుకోవాలి.

* సాధారణంగా మొబైల్ 1-2 చార్జింగ్ ఫుల్ అవుతుంది. కానీ కొంతమంది రాత్రంతా చార్జింగ్ పెట్టి అలాగే వదిలేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూడా మొబైల్ హీట్ ఎక్కుతుంది. కాబట్టి రాత్రంతా చార్జింగ్ పెట్టడం మంచిది కాదు.

* సాధారణంగా మొబైల్ తో పాటు అదే కంపెనీకి చెందిన చార్జర్ వస్తుంది. కానీ అదే చార్జర్ కాకుండా ఇతర చార్జర్ లను యూస్ చేస్తుంటారు కొందరు. అలా యూస్ చేయడం వల్ల కూడా మొబైల్ వేడెక్కుతుంది. కాబట్టి మొబైల్ తో పాటు వచ్చిన చార్జర్ యూస్ చేయడమే మంచిది

ఈ టిప్స్ పాటించడం ద్వారా మొబైల్ వేడెక్కే సమస్యను చాలావరకు తగ్గించవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Also Read:రెండు రోజుల్లో విలీనం..షర్మిల పాత్ర ఏంటో?

- Advertisement -