రెండు రోజుల్లో విలీనం..షర్మిల పాత్ర ఏంటో?

23
- Advertisement -

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా ఇదే విషయంపై వార్తలు వినిపిస్తున్నప్పటికి కన్ఫర్మ్ కాలేదు. కానీ తాజా పరిణామాలు చూస్తే విలీనం వైపే షర్మిల అడుగులు వేస్తున్నాట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా తన పార్టీ నేతలతో సమావేశం అయిన షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేతలతో విలీనంకు సంబంధించి చర్చించగా అందరూ కూడా సమ్మతిచించినట్లు సమాచారం. అందుకే మరో రెండు రోజుల్లో విలీనంపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని షర్మిల చెప్పుకొచ్చారు.

అయితే ఆమె కాంగ్రెస్ లో చరడం కన్ఫర్మ్ అవుతున్న వేళ హస్తం పార్టీలో ఆమె పాత్ర ఏంటనేది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రత్యేక్షంగా కాంగ్రెస్ కు మద్దతు పలికిన షర్మిల తాను తెలంగాణ బిడ్డనని తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగుతానని చెప్పుకొచ్చారు. దీంతో టి కాంగ్రెస్ లోనే ఆమెకు కీలక బాధ్యతలు అప్పగిస్తారా ? అనే ప్రశ్న ఒకవైపు వినిపిస్తుంటే.. కాదు కాదు షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని మరో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఢిల్లీ పెద్దలతో షర్మిలా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే అవకాశాలే ఎక్కువ అనేది తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఏపీలో బలపడాల్సి ఉంది. పైగా ఏపీలో షర్మిలకు వైఎస్ కూతురిగా మంచి ఇమేజ్ ఉంది. అందుకే ఆమె సేవలను ఏపీలో ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ సిద్దమైనట్లు తెలుస్తోంది. మరి ఆమె తెలంగాణలోనే కొనసాగుతానని చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారా ? లేదా రాజకీయ భవిష్యత్ కోసం ఏపీ కాంగ్రెస్ లో అడుగు పెడతారా ? అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా మరో రెండు రోజుల్లో షర్మిల అంశంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read:కాంగ్రెస్‌లోకి షర్మిల..ముహుర్తం ఫిక్స్

- Advertisement -