దేశంలో నూతనంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని తేల్చి చెప్పారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు.
దేశంలో నూతనంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని వెల్లడించారు. ఇదే నెలలో జరిగే శీతాకాల సమావేశాల్లో చట్టాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వ్యవసాయ బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచినట్లు వెల్లడించారు. రైతులు ఆందోళనలు విరమించి ఇళ్లకు వెళ్ళాలని కోరారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా రైతులకు సారీ చెప్పారు మోడీ.
ధర్నాలు చేస్తున్న రైతులంతా తమ ఇండ్లకు వెళ్లిపోవాలని ప్రధాని కోరారు. తాను ఏది చేసినా.. అది రైతుల కోసమే చేశానన్నారు. ఏది చేసినా.. అది దేశం కోసమే చేశానన్నారు. మీ దీవనలతో.. నా కృషినంతా మీకు ధారపోస్తానన్నారు.